Why People Are Much Obsessed With SUV Cars?

Why people are much obsessed with SUV cars?
2018-02-02 01:24:59

Why people are much obsessed with SUV cars?

ఎస్యూవీ కార్లంటే  ఆటోమొబైల్ ఇండస్ట్రీలో  ఎందుకంత క్రేజ్  ?

కారు కొనాలని  నిర్ణయించుకున్న ప్రతి ఒక వినియోగదారుడు హ్యాచ్బ్యాక్ కారు ,సెడాన్ కారు   లేదా ఎస్యూవీ  ఈ మూడింటిలో ఏది కొనాలో నిర్ణయించుకోవడంలో  కొంచెం తికమక పడవచ్చు. ఈ మూడు రకాల కార్లు తమదైన శైలిలో వివిధ రకాలైన ప్రయోజనాలు అందిస్తాయి .అయితే ఎస్యూవీ అంటే వినియోగదారులలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.దీనికి కారణాలు.

ఇవి చాలా విశాలంగా దృడంగా బరువుగా ఉంటాయి. చాలావరకు ఈ కార్లలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ  ప్రయాణికులు   కూర్చునే సదుపాయం ఉంటుంది.

ఎస్యూవీలో కూర్చుని ప్రయాణించే ప్రయాణికుడు చాలా సేఫ్ గా ఫీల్ అవుతాడు దీనికి కారణం దీని ధృడమైన పెద్దదైన ఆకారం. ప్రయాణికుడు కూర్చునే పొజిషన్ కూడా వేరే కార్లతో పోలిస్తే కొంచెం ఎత్తులో ఉంటుంది

 

ఎస్యువి  కార్లతో  ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్  చాలా అద్భుతంగా ఉంటుంది. కొండ ప్రాంతాలలో  మంచులో ఇవి  ఎక్కడా ఆగకుండా  చాలా శక్తివంతమైన , సురక్షితమైన  అనుభవాన్ని  ప్రయాణికులకి  అందిస్తాయి.

 

మీ కుటుంబంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నట్లయితే  హ్యాచ్బ్యాక్ కార్ల కంటే ఎస్యువి  కార్లు ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటాయి.

 

సిటీ దాటి దూరంగా  బయటి ప్రదేశాలకు ,  యాత్రలకు  వెళ్లేటప్పుడు  ఎస్యువి  కార్లలో ఉండే  3వ   వరుసలో ఉండే సీట్లు,  విశాలమైన బూట్ స్పేస్  చాలా ఉపయోగపడుతుంది .


 

బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉండి కార్ కొనాలనుకునే వినియోగదారుల్లో చాలామంది ఈ కారణాల వలన ఎస్యువి కార్లు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి    చూపుతున్నారు.

 

మనదేశంలోని వినియోగదారులకి కార్లంటే చాలా ఇష్టం అందుకే మార్కెట్లో రిలీజ్ అయ్యే ప్రతి ఎస్యూవీ స్కార్పియో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ , రెనాల్ట్ డస్టర్ అలాంటి కార్లని కొన్నివేల యూనిట్లలో అమ్ముడుపోతున్నాయి.

 

మీరు  ఎస్యూవీ  కారుని  కొనుగోలు  చెయ్యాలో లేదో నిర్ణయించుకో లెక పోతున్నారా ?

ఒకవేళ బడ్జెట్ సహకరించి పైన ఇవ్వబడిన అన్ని ప్రయోజనాలను పొందాలనుకుంటే అది ఒక ఎస్యూవీ కారు తోనే సాధ్యం.

 

ఎస్యూవీ కారు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో  15 లక్షలు ,ఆపైన ధరలలో లభిస్తుంది.

 

మార్కెట్లో ఉన్న బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ కార్లు

 

ఫోర్డ్ ఎకోస్పోర్ట్

రెనాల్ట్ డస్టర్

మహీంద్రా స్కార్పియో

జీప్

డిస్కవరీ.

Related Articles

Comments

Street Hawks is an online automobile content site in India with vision of providing on the go resource for all types of automobile enthusiasts. Street Hawks has a vision to provide everything for the interested admirers of automobiles in India. Street Hawks has a strong digital presence with the websites providing a daily feed of automobile news, updates and reviews.

Help Center