Mahindra S 201 Compact SUV Details  leaked

Mahindra S 201 compact SUV details  leaked
2018-02-02 01:24:59

Mahindra S 201 compact SUV details  leaked

 

మహీంద్రా S201 కాంపాక్ట్ SUV- 10 కి సంబంధించిన వివరాలు.


 

మహీంద్రా కంపెనీ తయారు చేస్తున్న  కొత్త ఎస్యూవీ కాంపాక్ట్ కారు మహీంద్రా S201 2018 డిసెంబర్   కంటే ముందే  వినియోగదారులకు అందుబాటులో రానుంది. దీని ధర 9 లక్షల కంటే ఎక్కువ ఉండవచ్చు .

 

మహీంద్రా S201 కాంపాక్ట్ SUV- 10 గురించి తెలుసుకోవాల్సిన కొన్ని వివరాలు.

 

ఇది ఒక కాంపాక్ట్ ఎస్యూవీ . ఈ కారు  XUV 500 ను పోలి దానికంటే చిన్నగా ఉంటుంది. ఈ కారును XUV 300 అనే పేరుతో మహీంద్రా కంపెనీ ఇండియన్ మార్కెట్లో   విడుదల చేసే అవకాశం ఉంది

 

డిజైన్ కు  సంబంధించినంతవరకు, XUV 500 మాదిరిగానే  మహీంద్రా S201  మోనోకోక్యూ బాడీ కలిగి ఉంటుంది. పెద్దగా  ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉంటుంది.  

ఇన్ని మహీంద్రా కార్లలో ఉన్నట్టుగానే విలక్షణంగా నిలువుగా ఉండే స్లేట్ గ్రిల్ మహీంద్రా S201  లో కూడా ఉంటుంది. కారు ఇంజన్ కి సంబంధించి  మహీంద్రా S201,  1.2 లీటర్ G80 టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు వేరియంట్లలో లభిస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఈ సెగ్మెంట్  కార్ మార్కెట్లో ఉన్న విపరీతమైన పోటీ కారణంగా మహీంద్రా S201 యొక్క అన్ని వేరియంట్లలో 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉండే అవకాశం ఉంది


 

మహీంద్రా S201  కారు 5-సీటర్ మరియు 7-సీటర్ ఆప్షన్ ని కలిగి ఉండే అవకాశం ఉందని , రానున్న దీపావళి సమయంలో  రిలీజ్ చేయబడుతుందని  మార్కెట్లో ఊహాగానాలు ఉన్నాయి .ఇదే నిజమైతే మహీంద్రా S201  కారు మార్కెట్లో ఉన్న అన్ని మంచి కార్లకు  గట్టి పోటీ ఇస్తుంది .

 

మహీంద్రా S201  కారులో  సరికొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్.  ఈ  ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్  ను ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ తో  కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంటుంది.

ఇప్పటివరకు   ఈ కారుకు సంబంధించిన వివరాలను పరిగణలోనికి తీసుకుంటే ఈ కారు ధర 9 నుండి 13 లక్షల నగదు ఉండవచ్చు.

Related Articles

Comments

Street Hawks is an online automobile content site in India with vision of providing on the go resource for all types of automobile enthusiasts. Street Hawks has a vision to provide everything for the interested admirers of automobiles in India. Street Hawks has a strong digital presence with the websites providing a daily feed of automobile news, updates and reviews.

Help Center