Why Should You Buy Electric Cars In 2018?

Why should you buy electric cars in 2018?
2018-02-02 01:24:59

Why should you buy electric cars in 2018?

 

2018 లో ఎలక్ట్రిక్ కార్లు ఎవరు కొనాలి?

ఇండియన్  ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ మొదలైంది.

భారతదేశానికి సంబంధించిన అన్ని మెట్రో నగరాలలో ఎలక్ట్రిక్ కార్లకు చేసుకునే చార్జింగ్ ప్రదేశాలు ఇదివరకే నెలకొల్పబడ్డాయి. అంతేకాకుండా ఈ ఛార్జింగ్ పాయింట్లు వేరు వేరు నగరాలకి వేగంగా వ్యాపిస్తున్నాయి.

 

2017 డిసెంబరు నాటికి ఇండియన్ మార్కెట్లో ఒక లక్షకి పైగా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. అంతేకాకుండా నగరవాసులు రోజూ మైలేజీని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ కార్లు  ఎలక్ట్రిక్ బైకులు  కొనుగోలు చేస్తూనే ఉన్నారు.

 

మీరు ఇకపై కారు లేదా బైక్ కొనే  ఆలోచనలో ఉంటే మీకు ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచే వాహనం  ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం.

 

ఎలక్ట్రిక్ కారు ప్రయోజనాలు

Benefits of having an electric car

 

అత్యధిక   మైలేజీ

 


 

తక్కువ ధర

 

ఆధునిక టెక్నాలజీ

 

కాలుష్య రహితం

 

 

 

 

ఎలక్ట్రిక్ కార్ల మైలేజీ డీజిలు లేదా పెట్రోలు కార్లతో పోలిస్తే చాలా ఎక్కువ . ఇదివరకు వినియోగదారులు పెట్రోలుపై ప్రతినెలా చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది.  మెట్రో నగరాల్లో అయితే ట్రాఫిక్  కారణంగా  వాహనాల మైలేజీ ఇంకా తక్కువగా ఉంటుంది.

 

ప్రతి డీజిల్ బండి ఒక  కిలోమీటరుకు 3  నుండి 10  రూపాయల డీజిలు   ఉపయోగించుకుంటుంది.

కానీ ఒక ఎలక్ట్రిక్ కార్ విషయంలో కిలోమీటర్ ఖర్చు  ఒక రూపాయి కన్న తక్కువ. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే  200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఒకవేళ మీరు నగరంలో మాత్రమే ప్రయాణిస్తుంటే  నగరంలో ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేసే సదుపాయం ఇదివరకే ఉంటే మీరు ఎలక్ట్రిక్ కారును ఎంచుకోవచ్చు.  వీటి మెయింటెనెన్స్  ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా   దాదాపు అన్ని ఎలక్ట్రిక్ కార్లలో   విద్యుత్తు పునరుత్పత్తి బ్రేకింగ్ సిస్టం   ఉంటుంది. ఈ టెక్నాలజీ వలన బ్రేక్ వేసినప్పుడల్లా   కారు బ్యాటరీ చార్జ్ అవుతూ ఉంటుంది.

 

 

 

ఎలక్ట్రిక్ కార్ల ధర చాలా తక్కువ . దీనికి కారణం  2030  లోపు  భారతదేశంలో వీలైనన్ని ఎలక్ట్రిక్ కార్లు ఉండేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం వీటిపై  కస్టమ్ జీఎస్టీ  తదితర టాక్స్ లు  తక్కువగా ఉంటాయి.  ఈ విధంగా ధరలు తగ్గించి   వినియోగదారులు  ఎలక్ట్రిక్ కార్లను  మీరు కొనేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. ఒకసారి మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ వచ్చిన తరువాత  వీటి  ధరలు విపరీతంగా పెరగవచ్చు . అందుకే ఎలక్ట్రిక్ కారు కొనడానికి ఈ సమయం అన్నింటికన్నా అనుకూలమైనది.

 

 

 

 

ఎలక్ట్రిక్ కార్లు  కూడా అత్యాధునిక టెక్నాలజీని వాడుకుంటాయి. ఒక సెల్ ఫోన్ బ్లూటూత్ ద్వారా ఈ కారులో ఉన్న చాలా ఫీచర్స్ కంట్రోల్ చేయవచ్చు. కార్డు స్టేటస్ మొబైల్ లో చూడవచ్చు

ఒకవేళ కారు బ్యాటరీ అయిపోవడానికి దగ్గరగా ఉంటే  దగ్గరలో ఉన్న చార్జింగ్  ప్రదేశానికి  నావిగేషన్ ద్వారా వెళ్లే  సదుపాయం ఉంటుంది.

 

 


 

నడపడం సులభం

easy handling

 

ఎలక్ట్రిక్ కార్లను నడపడం కూడా సులభం . ఎందుకంటే వీటిలో  గేరింగ్ వ్యవస్థ మరియు క్లచ్  ఉండవు . ఇవన్నీ ఒక రకంగా ఆటోమేటిక్ బండ్లు .

 

 

ఇది మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్ల నుండి కాలుష్యం ఉండదు ఇవి పర్యావరణానికి మంచిది.

Related Articles

Comments

Street Hawks is an online automobile content site in India with vision of providing on the go resource for all types of automobile enthusiasts. Street Hawks has a vision to provide everything for the interested admirers of automobiles in India. Street Hawks has a strong digital presence with the websites providing a daily feed of automobile news, updates and reviews.

Help Center